వేటూరి గారి గురించి ఇంకోసారి....
ఆయన అక్షరాల్లోని ఆర్ద్రత బండ రాయిని గౌతమిగా పరవళ్ళు తోక్కిస్తుంది.
కొమ్మలు తాకిన ఆమనికి పుట్టిన కోయిలమ్మని
రాగాల పల్లకిలో వూరేగిస్తుంది...
పుచ్చాపువ్వుల వీచే తావుల వెచ్చావెన్నెలలు...
స్వరరాగ గంగా ప్రవాహాలు...
రాలిపోయే పూల రాగాలు...
ఏ శకునీ ఆడని జూదాలు...
కర్పూర వీణలు...
ఆషాడ మాసాలు మెరిసేటి మేఘాలు...
...ఎన్నని?
కవిగా హిమాలయ సదృశంగా ఎదిగిన ఆ మహనీయుడు వెండితెరకు చీనాంబరి.
తెలుగు సినిమా పాటకి అత్యంత వైభవంగా అయిదు రోజుల పెళ్లి జరిపించి, తనకు తగిన తాంబూలం అందకుండానే మౌనంగా నిష్క్రమించిన సిని ఆస్థాన పురోహితుడు శ్రీ వేటూరి.
వారికి ఏం ఇచి ఋణం తీర్చుకోగలం?
ఎప్పట్లాగే వారి పాటను ప్రేమించడం మినహా.
సాహితీ సుగంధం, అక్షర సుమ సౌరభం కొన్ని తరాలపాటు తరగని అక్షయపాత్ర ఆయన పాట.
ఆ పాటకి శతసహస్ర సవినమ్ర వందనాలు...
..రాధాకృష్ణ
(కొబ్బరాకు, పుస్తకం)

ఆగిపోయే పాటకి అనంతశక్తినిచ్చిన వేటూరిగార్కి, మీరు చక్కని పదార్చన చేసారు.
రిప్లయితొలగించండి