మర్చిపోలేని ఫోన్...
ఓ రోజు ఉదయం...
ఏడు ఏడున్నర....
ఫోన్ మోగింది. నెంబర్ చూసాను. పరిచయం లేనిది. తీసుకున్నాను.
అవతలనుంచి వినబడిన పేరు విని, నాకు "ఆశ్చర్యంతో కూడిన ఆనందం వల్ల వచ్చిన త్రిల్లింత".
అ ఫోన్ చేసింది శ్రీ ఎం ఎం కీరవాణి గారు.
ఎంతో అభిమానించే అంత గొప్ప సంగీత దర్శకుడు ఫోన్ చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.
ఊహించని ఫోను.
ఆ ముందు రోజు నేను, మా రఘు గారు వెళ్లి ప్రసాద్ లాబ్స్ లో ఆల్బం పుస్తకం ఇచ్చి వచ్చాం.
అప్పటికి ఆయన చాలా బిజీ గా వున్నారు.
దాదాపు ఊపిరి సలపనంత పని.
అంత పని లోను పుస్తకం చదివి అభినందించారు.
పైగా పైపైన చదవడం కాదు...ఒక కవిత రెండు సార్లు వచ్చిందని చెప్పారు.
మూడు రెండు ఒకటి...అని ఆ పుస్తకం లోని కవితల సంఖ్యతో ఓ హైకు చెప్పారు.
అంత క్రిటికల్ గా చదివారు.
ఆల్బం పుస్తక ఆవిష్కరణకి ఆయన్ని రమ్మన్నా కుదరక రాలేదు.
మా రఘు గారికి కృతజ్ఞతలు.
కీరవాణి గారికి శతసహస్ర వందనాలు.
...రాధాకృష్ణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి