సిమ్ము సిమ్ముకో సన్నాయి

దాదాపు పంతొమ్మిది సంవత్సరాల క్రితం "ఈనాడు జర్నలిజం స్కూల్లో" చదువుకున్న మిత్రులు అందరం మళ్ళీ కలిసాం.
కాస్సేపు "ఎక్కడో పుట్టి" టైపులో సాంగ్...
చదువులమ్మ చెట్టు మారింది కాని నీడ అదే..
మధు ఆఫీసు లో జరిగిన ఈ సమావేశం ఎందుకో చాలా కొత్తగా అనిపించింది.  బాగా గాప్ రావడం ఒక కారణం కావచ్చు...
జీవితం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వయసు నుంచి...ఒక ముఖ్యమైన దశను దాటుకొని, ఇన్నేళ్ళ తరవాత పాత మిత్రుల్ని, వాళ్ళ జీవితాల్ని చూస్తే గమ్మత్తుగా అనిపించింది. అప్పటి మనుషులు అలాగే వున్నారు.కాని ఆలోచనలు..జీవితం ఇచ్చిన అనుభవాలు...ఇవన్ని గొప్పగా వున్నాయి..
లెఫ్ట్ ఆలోచనలతో చాలా ఆవేశంగా ఉండే ఒక మిత్రుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు.
సాహిత్యాన్ని ప్రేమించే ఇంకో మిత్రుడు ప్రొడక్షన్ సంస్థ నడుపుతున్నాడు. (ఇప్పుడు పుస్తకాల్ని బీరువాలో పెడుతున్నాడు.)
జర్నలిజం లో శిక్షణ తీసుకొని ఒక ఫ్రెండ్ టీచర్ అయ్యాడు. ఒక మిత్రుడు టీవీ ట్రైనింగ్ కాలేజీ కి హెడ్ అయ్యాడు.
కొందరు టీవీ కి వెళ్లారు.
ఒక అమ్మాయి ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తున్నారు.
ఒక ఫ్రెండ్ ఆంగ్ల పత్రికకు వెళ్ళాడు.
ఇద్దరు ముగ్గురు  తప్ప అందరు ఈనాడు నుంచి బయటకు వచ్చారు.
కాని ఎవరు ఎవరికీ కనిపించిన పలకరింపులో అదే గౌరవం...అదే స్నేహ స్వభావం...
అందరూ ఫోన్ నంబెర్స్ గట్రా ఇచిపుచ్చుకున్నారు. 
పంతొమ్మిది కాదు ఎన్నేళ్ళు గడిచినా ఇది ఎప్పటికీ అలాగే ఉంటుందని...వుండాలని కోరుకుంటూ...
గురువుగారు బూదరాజు రాధాకృష్ణ గారిని ఒకసారి గుర్తుచేసుకుంటూ...

సిమ్ము సిమ్ముకో సన్నాయి

...రాధాకృష్ణ 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్