మోరి... జాగ్రఫీ- కోనసీమ. ఫోటోగ్రఫీ- చుట్టూ పచ్చదనం.. అటుపక్క గోదావరి అందం ... ఇటుపక్క సముద్రం... !! భోగి పండగ రోజు ... టైం రఫ్ గా నాలుగు.. చలిని తట్టుకోవడం చాలా టఫ్ గా ఉంది. మంచు తెర కప్పినట్టుంది ఊరంతా. మకర్రాశిలోకి మారిన సూరీడు కొత్తిల్లు సద్దుకోడంలో హడావిడిలో ఉన్నాడేమో ... ఇంకా పైకి రాలేదు. వీధులన్నీ కొత్త పెళ్ళికూతుళ్లలా అందంగా ఒద్దిగ్గా ముస్తాబై ఉన్నాయి. అప్పటివరకూ వాకిళ్ళని పేడతో అలికి, ముగ్గులతో సింగారించిన ఆడవాళ్లు కాస్సేపు నడుమువాల్చి చిన్న కోడి కునుకుతీసి వెంటనే మళ్ళీ లేచి పండగ సందడి మొదలు పెట్టారు. గంగాళాలతో నీళ్లు గాడిపొయ్యలెక్కాయి. భోగి మంటలకంటే ముందే ఇళ్లల్లో ఈ మంటలు అందుకున్నాయి. చిన్న పిల్లలు చిన్నా చితుకూ ఖాళీల్ని ముగ్గులతో నింపేస్తున్నారు. నడవడానికి కాళ్ళు కాదుకదా వేళ్ళు కూడా పెట్టడానికి చోటులేకుండా. నైట్ హాల్ట్ బస్సు డ్రైవరు, కండక్టరు రగ్గులు చుట్టేసుకుని, వణికిపోతూ బస్సు అద్దాల్లోంచి చూస్తూ కూర్చున్నారు.. భోగి మంట ఎప్పుడు వెలిగిస్తారా అని. "చలపతిరాయ నికేతనం" లోంచి వెలివేల వెంకటాచలం గారు, గోపరాజు సుందరరావు గారు, గ...
నమస్కారం రాధాకృష్ణ గారు. మీ కధలు చదివాను. మీ బ్లాగు చూడడం సంతోషంగా ఉంది.
రిప్లయితొలగించండిoh. i love reading ur stories in eenadu. chinnapati nundi u r one of my fav writer :D
రిప్లయితొలగించండిnice seeing here.
Thanq so much.
రిప్లయితొలగించండి...radhakrishna
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి