మోరి... జాగ్రఫీ- కోనసీమ. ఫోటోగ్రఫీ- చుట్టూ పచ్చదనం.. అటుపక్క గోదావరి అందం ... ఇటుపక్క సముద్రం... !! భోగి పండగ రోజు ... టైం రఫ్ గా నాలుగు.. చలిని తట్టుకోవడం చాలా టఫ్ గా ఉంది. మంచు తెర కప్పినట్టుంది ఊరంతా. మకర్రాశిలోకి మారిన సూరీడు కొత్తిల్లు సద్దుకోడంలో హడావిడిలో ఉన్నాడేమో ... ఇంకా పైకి రాలేదు. వీధులన్నీ కొత్త పెళ్ళికూతుళ్లలా అందంగా ఒద్దిగ్గా ముస్తాబై ఉన్నాయి. అప్పటివరకూ వాకిళ్ళని పేడతో అలికి, ముగ్గులతో సింగారించిన ఆడవాళ్లు కాస్సేపు నడుమువాల్చి చిన్న కోడి కునుకుతీసి వెంటనే మళ్ళీ లేచి పండగ సందడి మొదలు పెట్టారు. గంగాళాలతో నీళ్లు గాడిపొయ్యలెక్కాయి. భోగి మంటలకంటే ముందే ఇళ్లల్లో ఈ మంటలు అందుకున్నాయి. చిన్న పిల్లలు చిన్నా చితుకూ ఖాళీల్ని ముగ్గులతో నింపేస్తున్నారు. నడవడానికి కాళ్ళు కాదుకదా వేళ్ళు కూడా పెట్టడానికి చోటులేకుండా. నైట్ హాల్ట్ బస్సు డ్రైవరు, కండక్టరు రగ్గులు చుట్టేసుకుని, వణికిపోతూ బస్సు అద్దాల్లోంచి చూస్తూ కూర్చున్నారు.. భోగి మంట ఎప్పుడు వెలిగిస్తారా అని. "చలపతిరాయ నికేతనం" లోంచి వెలివేల వెంకటాచలం గారు, గోపరాజు సుందరరావు గారు, గ...
So nice! Thanks for sharing your memories with us.
రిప్లయితొలగించండిఇన్నాళ్ళూ తాటాకు మీదే రాస్తారనుకున్నా...ఇలా కొబ్బరాకు మీదా ఆల్బం గీస్తారని ఇవాళే తెలుసుకున్నా...మీ హైకూల మొదటి ముద్రణ 'ఆల్బం ' సిరివెన్నెల తో కలిసిన ఆల్ బొమ్మల ఆల్బం, అన్నీ అద్భుతం..
రిప్లయితొలగించండిమా టీవీలో "గో "ప్యంగా "రా "సుకుపోతూ
ఎప్పుడిన్ని హైకూలు రాసేసారో తెలియలేదు. 'మా ' పక్కనే తిరుగుతున్నా మీ స్థాయి ఎక్కడో పై అంతస్థులో.... అయినా ...మీ పక్కన తిరగనిచ్చినందుకు ధన్యవాదాలు.
ఎన్ని కతలు..కవితలు..హైకూ లతలు..అబ్బో..బెమ్మాండం...బెమ్మానందం ... మాకూ హైకూలు వినిపించినందుకూ..ఆవిష్కరణకి పిలిచినందుకూ..పేజీలో పేరేసినందుకూ...అన్నిటికి కలిపి... మీకు ముక్కోటి కృతజ్ఞతలు. మీకు తెలీని ఓ విషయం చెబుతా రాధా కృష్ణగారు .. అదేంటంటే... మీరో "గో" ప్ప ''రా'' జు గారు గోపరాజు గారు
మరో విషయం చెప్పడం మర్చిపోయా..
రిప్లయితొలగించండివెన్నెల మనందరికీ నచ్చుతుంది..కానీ ఆ వెన్నెలకి..అందునా సిరివెన్నెలకి నచ్చడం...ఒక్క గోరా కే సాధ్యం..
Dhanyavadalu...
రిప్లయితొలగించండిSirivennela garu naa pustakam lo vundalsina poems ni select chesaru. Ala select chestu rasina oka coment naa jevitamlo marchipolenidi. aa coment ni pustakam lo vesanu. Adi "simply extraordinary expression".
...radhakrishna
Congratulations and happy to hear
రిప్లయితొలగించండిTitle & template చాలా బాగున్నాయండి!
రిప్లయితొలగించండిchala to the power of chala thanx.
రిప్లయితొలగించండి...radhakrishna