ఐశ్వర్యలహరి



పూలజాతుల సౌకుమార్యం జీవం పోసుకున్నట్టు....

నీలాంబరి తనకు తానే ఆమె రెండు కళ్ళు అయినట్టు..

ఏడు మల్లెల ఎత్తు అందానికి వెన్నెల పోతపోసినట్టు...

సౌందర్యలహరి ప్రతి గుండెలో గలగలా ప్రవహించినట్టు...

ఏ దేవలోకం నుంచో దేవత దారితప్పి ఇక్కడికి వచ్చినట్టు..

వర్షంలో తడిసిన పావురం గుడిగోపురం గూట్లో దాక్కున్నట్టు...

వాన చినుకుల మధ్య మెరుపు నాట్యం చేస్తున్నట్టు...

ఐశ్వర్య రాయ్

(విలన్ సినిమా చూసాక...)

కామెంట్‌లు

  1. నిజమేనండీ ......పూల రెక్కలూ ...కొన్ని తేనెచుక్కలూ రంగరించి చందనపు పూతపూసినట్టు అనిపిస్తుందామెను చూస్తుంటే !

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్