యండమూరి గారి ప్లాట్ తో...


ప్రార్థన నవలలో యండమూరి గారు ఒక కధాంశం ఇచ్చారు. కూతురు పెళ్లి కోసం డబ్బు దాచుకున్న తరవాత తండ్రి ఆరోగ్యం కోసం ఆ డబ్బు ఖర్చుపెడితే ఎలా వుంటుందో ఎవరైనా ఒక కథ రాస్తే బాగుంటుంది అని ఆయన ఆ నవలలో రాసారు. ఆ ప్లాట్ తో నేను కథ రాసాను. అదే నా మొదటి కథ. దాని పేరు "గాడ్...ది సాడిస్ట్". ఆ కథని పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వీక్లీ కి సెలెక్ట్ చేసి పబ్లిష్ చేసారు. అది నేను విద్యార్ధి రచయితగా రాసింది.అప్పటినుంచి రచనలను కొనసాగిస్తున్నాను. ఇటీవల  మూడు కథలు రాసాను. 
అవి...
చినుకులా రాలి..
గుండె గోదావరి 
విజయశ్రీ టూరింగ్ టాకీస్ 

వీటిలో "చినుకులా రాలి " కథ కి శైలి పరంగా ఏంతో ప్రత్యేకత వుంది. ఆ కథ విపుల లో సెలెక్ట్ అయింది..
ఇప్పటి వరకు రాసిన కథలు వందకు పైనే...
వీటిలోంచి సెలెక్ట్ చేసి పుస్తకానికి సిద్ధం  చేయాలి.
పుస్తకానికి టైటిల్ "చీర ఉయ్యాల".(ఇప్పటికి) 

...రాధాకృష్ణ

కామెంట్‌లు

  1. రాధాకృష్ణగారు,

    నమస్కారం. వీలైతే మీ పాత కధలు బ్లాగులో పెట్టండి. మేము కూడా వాటిని చదివి ఆనందిస్తాము..

    రిప్లయితొలగించండి
  2. జ్యోతిగారి అభిప్రాయమే నాదికూడాను!

    రిప్లయితొలగించండి
  3. రాధాకృష్ణ గారు,
    కొబ్బరాకు వెన్నెల్లో టప టప మంటూ చల్లగా హాయిగా ఉంది.

    మీ ప్రొఫైలు కూడా తెలుగులో పెట్టండి వీలైతే!అలాగే కూడలిలో కూడా "kobbaraaku" అని ఆంగ్లంలో కాక ఎంచక్కా తెలుగులో కనపడేట్లుగా సెట్టింగ్స్ మార్చండి సర్!


    బ్లాగులో మీ పాత కథలు పెడతారని చూస్తూ....

    రిప్లయితొలగించండి
  4. "చీర ఉయ్యాల" పేరు బాగుంది. నేను కూడా మీ కథల కోసం ఎదురుచూస్తూ!

    రిప్లయితొలగించండి
  5. చాలా చాలా ధన్యవాదాలు.
    ...రాధాకృష్ణ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్