పోస్ట్‌లు

జూన్, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

గుండె తడి

చిత్రం
నీ గుండె వాటర్ ప్రూఫా  తడే  లేదు

ఓ జ్ఞాపకం

చిత్రం
వంశీ గారితో మా టీవీ ప్రాజెక్ట్ "రేపటి దర్శకులు" కాన్సెప్ట్ గురించి ...

రజత యవనిక

చిత్రం
ప్లాస్టిక్ పూల మీద గ్రాఫిక్ తుమ్మెద  సినిమా

అద్దం

చిత్రం
ఆమె చారడేసి కళ్ళల్లో  చూసుకుంటోంది  అద్దం (ఆల్బం నుంచి...)

ఒక పూల తోట

చిత్రం
పెదవి కొమ్మ పూసే  నవ్వు పూలని కళ్ళు కోసుకుంటున్నాయ్  ("ఆల్బం" నుంచి...)

పసి మేఘం

చిత్రం
కొండ వాలు మబ్బు నీడకి జారుడుబల్ల  ... రాధాకృష్ణ

ఐశ్వర్యలహరి

చిత్రం
పూలజాతుల సౌకుమార్యం జీవం పోసుకున్నట్టు.... నీలాంబరి తనకు తానే ఆమె రెండు కళ్ళు అయినట్టు.. ఏడు మల్లెల ఎత్తు అందానికి వెన్నెల పోతపోసినట్టు... సౌందర్యలహరి ప్రతి గుండెలో గలగలా ప్రవహించినట్టు... ఏ దేవలోకం నుంచో దేవత దారితప్పి ఇక్కడికి వచ్చినట్టు.. వర్షంలో తడిసిన పావురం గుడిగోపురం గూట్లో దాక్కున్నట్టు... వాన చినుకుల మధ్య మెరుపు నాట్యం చేస్తున్నట్టు... ఐశ్వర్య రాయ్ (విలన్ సినిమా చూసాక...)

సిమ్ము సిమ్ముకో సన్నాయి

చిత్రం
దాదాపు పంతొమ్మిది సంవత్సరాల క్రితం "ఈనాడు జర్నలిజం స్కూల్లో" చదువుకున్న మిత్రులు అందరం మళ్ళీ కలిసాం. కాస్సేపు "ఎక్కడో పుట్టి" టైపులో సాంగ్... చదువులమ్మ చెట్టు మారింది కాని నీడ అదే.. మధు ఆఫీసు లో జరిగిన ఈ సమావేశం ఎందుకో చాలా కొత్తగా అనిపించింది.  బాగా గాప్ రావడం ఒక కారణం కావచ్చు... జీవితం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వయసు నుంచి...ఒక ముఖ్యమైన దశను దాటుకొని, ఇన్నేళ్ళ తరవాత పాత మిత్రుల్ని, వాళ్ళ జీవితాల్ని చూస్తే గమ్మత్తుగా అనిపించింది. అప్పటి మనుషులు అలాగే వున్నారు.కాని ఆలోచనలు..జీవితం ఇచ్చిన అనుభవాలు...ఇవన్ని గొప్పగా వున్నాయి.. లెఫ్ట్ ఆలోచనలతో చాలా ఆవేశంగా ఉండే ఒక మిత్రుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. సాహిత్యాన్ని ప్రేమించే ఇంకో మిత్రుడు ప్రొడక్షన్ సంస్థ నడుపుతున్నాడు. (ఇప్పుడు పుస్తకాల్ని బీరువాలో పెడుతున్నాడు.) జర్నలిజం లో శిక్షణ తీసుకొని ఒక ఫ్రెండ్ టీచర్ అయ్యాడు. ఒక మిత్రుడు టీవీ ట్రైనింగ్ కాలేజీ కి హెడ్ అయ్యాడు. కొందరు టీవీ కి వెళ్లారు. ఒక అమ్మాయి ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ ఆంగ్ల పత్రికకు వెళ్ళాడు. ఇద్దరు ముగ్గురు  తప్ప అందరు ఈనాడు నుంచ...

ఈ గాలి....

ఫ్యాన్  రెక్కల కష్టం  గాలి  ...రాధాకృష్ణ 

మౌనమే నీ భాష...

అమ్మాయి కళ్ళే కాదు చెక్కిళ్ళూ  మాట్లాడుతున్నాయి ...రాధాకృష్ణ

ఎల్బీ శ్రీరామ్...

నేను పుస్తకం లో రాసిన వాతావరణం ఆయనకీ బాగా నచ్చింది. పుస్తకం అంతా చదివి, నాకు ఫోన్ చేసారు. పుస్తకంలో చాలా కవితల్ని మళ్ళీ నాకు చదివి వినిపించారు.  పుస్తకంలో బాగున్నవి టిక్ చేద్దామని పెన్ను పట్టుకుంటే, పుస్తకం నిండా టిక్కులు ఉన్నాయని చెప్పారు. ఆ టిక్కులతో నేను హ్యాపీ. ...రాధాకృష్ణ

శ్రీ ఎల్బీ శ్రీరామ్

ఆల్బం చదివిన శ్రీ ఎల్బీ శ్రీరామ్ ఏమన్నారో ... రేపు కొబ్బరాకు నీడలో చల్లగా...

మర్చిపోలేని ఫోన్...

ఓ రోజు ఉదయం... ఏడు ఏడున్నర.... ఫోన్ మోగింది. నెంబర్ చూసాను. పరిచయం లేనిది. తీసుకున్నాను. అవతలనుంచి వినబడిన పేరు విని, నాకు "ఆశ్చర్యంతో కూడిన ఆనందం వల్ల వచ్చిన త్రిల్లింత". అ ఫోన్ చేసింది శ్రీ ఎం ఎం కీరవాణి గారు. ఎంతో అభిమానించే అంత గొప్ప సంగీత దర్శకుడు ఫోన్ చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఊహించని ఫోను. ఆ ముందు రోజు నేను, మా రఘు గారు వెళ్లి ప్రసాద్ లాబ్స్ లో ఆల్బం పుస్తకం ఇచ్చి వచ్చాం. అప్పటికి ఆయన చాలా బిజీ గా వున్నారు. దాదాపు ఊపిరి సలపనంత పని.  అంత పని లోను పుస్తకం చదివి అభినందించారు. పైగా పైపైన చదవడం కాదు...ఒక కవిత రెండు సార్లు వచ్చిందని చెప్పారు. మూడు రెండు ఒకటి...అని ఆ పుస్తకం లోని కవితల సంఖ్యతో ఓ హైకు చెప్పారు. అంత క్రిటికల్ గా చదివారు. ఆల్బం పుస్తక ఆవిష్కరణకి ఆయన్ని రమ్మన్నా కుదరక రాలేదు. మా రఘు గారికి కృతజ్ఞతలు. కీరవాణి గారికి శతసహస్ర వందనాలు. ...రాధాకృష్ణ

పూలజడ

కురుల తీగె  విరబూసింది ..పూలజడ  - రాధాకృష్ణ 

యండమూరి గారి ప్లాట్ తో...

ప్రార్థన నవలలో యండమూరి గారు ఒక కధాంశం ఇచ్చారు. కూతురు పెళ్లి కోసం డబ్బు దాచుకున్న తరవాత తండ్రి ఆరోగ్యం కోసం ఆ డబ్బు ఖర్చుపెడితే ఎలా వుంటుందో ఎవరైనా ఒక కథ రాస్తే బాగుంటుంది అని ఆయన ఆ నవలలో రాసారు. ఆ ప్లాట్ తో నేను కథ రాసాను. అదే నా మొదటి కథ. దాని పేరు "గాడ్...ది సాడిస్ట్". ఆ కథని పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వీక్లీ కి సెలెక్ట్ చేసి పబ్లిష్ చేసారు. అది నేను విద్యార్ధి రచయితగా రాసింది.అప్పటినుంచి రచనలను కొనసాగిస్తున్నాను. ఇటీవల  మూడు కథలు రాసాను.  అవి... చినుకులా రాలి .. గుండె గోదావరి  విజయశ్రీ టూరింగ్ టాకీస్  వీటిలో "చినుకులా రాలి " కథ కి శైలి పరంగా ఏంతో ప్రత్యేకత వుంది. ఆ కథ విపుల లో సెలెక్ట్ అయింది.. ఇప్పటి వరకు రాసిన కథలు వందకు పైనే... వీటిలోంచి సెలెక్ట్ చేసి పుస్తకానికి సిద్ధం  చేయాలి. పుస్తకానికి టైటిల్ "చీర ఉయ్యాల".(ఇప్పటికి)  ...రాధాకృష్ణ

కవితా ఓ కవితా...

దండలో దారానికి  సారథి  సూది ...రాధాకృష్ణ

కవితా ఓ కవితా...

స్నానాల వే ళ   అద్దం పెట్టుకుంది  బొట్టు బిళ్ళ   ...రాధాకృష్ణ 

ఓ కవితా...

ఈరోజు కవిత... తుండు మిస్సింగ్  అమ్మ కొంగుదే  ఆ డ్యూటీ  ...ఇలాంటివి నా ఆల్బం పుస్తకం లో ఎన్నో వున్నాయి... ..రాధాకృష్ణ

సిరివెన్నెల గారితో...

చిత్రం
ఆల్బం పుస్తకాన్ని శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇవ్వడానికి వెళ్లినపుడు... ఆల్బం పుస్తకానికి ఆయన ఆశిస్సులు ఎన్నో ఉన్నాయి. పుస్తకాన్ని చూసారు...ఆప్యాయంగా మాట్లాడారు.  ఆ ఆనంద క్షణాలు....

ఆల్బం సమీక్ష

చిత్రం
నిన్న బయటకి వచ్చిన ఆంధ్రజ్యోతి వార పత్రిక లో ఆల్బం పుస్తక సమీక్ష వచ్చింది, రివ్యూ ఇదే...

వేటూరి గారి గురించి ఇంకోసారి....

ఆయన అక్షరాల్లోని ఆర్ద్రత బండ రాయిని గౌతమిగా పరవళ్ళు తోక్కిస్తుంది . కొమ్మలు తాకిన ఆమనికి పుట్టిన కోయిలమ్మని రాగాల పల్లకిలో వూరేగిస్తుంది... పుచ్చాపువ్వుల వీచే తావుల వెచ్చావెన్నెలలు... స్వరరాగ గంగా ప్రవాహాలు... రాలిపోయే పూల రాగాలు... ఏ శకునీ ఆడని జూదాలు... కర్పూర వీణలు... ఆషాడ మాసాలు మెరిసేటి మేఘాలు... ...ఎన్నని? కవిగా హిమాలయ సదృశంగా ఎదిగిన ఆ మహనీయుడు వెండితెరకు చీనాంబరి. తెలుగు సినిమా పాటకి అత్యంత వైభవంగా అయిదు రోజుల పెళ్లి జరిపించి, తనకు తగిన తాంబూలం అందకుండానే మౌనంగా నిష్క్రమించిన సిని ఆస్థాన పురోహితుడు శ్రీ వేటూరి. వారికి ఏం ఇచి ఋణం తీర్చుకోగలం? ఎప్పట్లాగే వారి పాటను ప్రేమించడం మినహా. సాహితీ సుగంధం, అక్షర సుమ సౌరభం కొన్ని తరాలపాటు తరగని అక్షయపాత్ర ఆయన పాట. ఆ పాటకి శతసహస్ర సవినమ్ర వందనాలు... ..రాధాకృష్ణ (కొబ్బరాకు, పుస్తకం)

వేటూరి వారికి అక్షర నివాళి

వేటూరి... మూడు అక్షరాల సాహితీ సర్వస్వం. తెలుగు సినిమా పాత చెంపలకి చందనం పూసి, కాళ్ళకు పసుపు పారాణి రాసి... పాటని నవ్వించి, కవ్వించి పెంచి పెద్ద చేసి... పాటని ఇందువదనా కుందరదన మందగమన మధుర వచనగా మన ముందు నిలబెట్టిన వేటూరి వారు అనంత లోకాలకి వెళ్ళిపోయారు... సందర్భం వింటుండగానే సాహితీ గంగని ఆలోచన లోకల్లోంచి ఇలకు దింపే ప్రయత్నం అనునిత్యం చేసే అపర భగిరధుడు ఆయన... పాటంటే మూడు నిమిషాల సాహిత్యంతో కలబోసుకున్న సంగీతం మాత్రమే కాదని... అది జీవితానికి మార్గదర్శి లా దిక్సూచిలా పనిచేస్తుందని ఆజన్మాంత పాఠం చెప్పిన మహానుభావుడు ఆయన... ఆయన పాటని, మనల్ని వదలి వెళ్ళారంటే మనతో పటు పాటకీ కళ్ళు చేమరుస్తున్నాయి. ఆయన పాటల్లో ఒదిగిన భావాలూ బావురుమంతున్నాయి ఆయన ఆలోచనల్ని శాశ్వతంగా నిలబెట్టిన అక్షరాలూ అనాదలయ్యాయి. aయినా ఆయన పాత అమరం. ...రాధాకృష్ణ

ఆల్బం లో ఏముంది?

ఆల్బం మౌలికంగా కవిత్వం. హైకు సదృశ కవితలు అనేది ఈ పుస్తకం ఉప శీర్షిక. జీవితంలో మనం అందరం చుసిన ప్రతి వాస్తవాన్ని ఒక జ్ఞాపకం లాగా పదిలపరిచింది ఆల్బం. నా పరిశీలనకి కుంచెం కవిత్వాన్ని జోడిస్తే అదే ఆల్బం అయింది. ఈ పుస్తకం తీసుకు రావాలని దాదాపుగా రెండేళ్లుగా ఆశ. కల. అది నెరవేరింది. చెట్టు నుంచి చినుకు వరకు, పార్క్ నుంచి దండెం వరకు, పాల సీసా నుంచి చీర వరకు, సినిమా నుంచి బాల్యం వరకు అన్ని ఆల్బం లో వున్నాయి. ముఖ చిత్రం పైన పుస్తకం పేరు, నా పేరు శ్రీ బాపు గారు రాసారు. పుస్తకం ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. లోపల విషయం తో పాటు చూడడానికి ఆధునికంగా కనిపించే పుస్తకం నాది. ముఖచిత్రం వగైరా రేపు మాట్టడుకుందాం. ...రాధాకృష్ణ

ఆల్బం

చిత్రం
నా ఆల్బం పుస్తకం ఆవిష్కరణ ఈ మధ్య జరిగింది. శ్రీ తనికెళ్ళ భరణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయనే ఈ పుస్తకానికి ముందు మాట కూడా రాసారు. ఆ ముందు మాటకి నేను పచ్చ తోరణం అని పేరు పెట్టాను. ఆవిష్కరణ ఫోటో ఇది...

శ్రీ వేటూరి

శ్రీ వేటూరి గారు మనలోంచి మరో లోకానికి పాటలు రాయడానికి వెళ్లి పన్నెండు రోజులయింది. ఆ మహనీయుడికి కొబ్బరాకు, పుస్తకం నివాళులు అర్పిస్తున్నాయి. ...రాధాకృష్ణ

కవిత్వం

తీగ పైన పక్షుల్లా గీత మీద అక్షరాలు ఒక్కోటి వాల్తున్నాయి ...ఇది నా ఆల్బం పుస్తకం లోని హైకు సదృశ కవిత. ఆ తీగ ఏంటో... ఆ అక్షరాలు ఏంటో... రేపు మాట్లాడుకుందాం. ...రాధాకృష్ణ

మహా గణపతిం

కొబ్బరాకు... కొబ్బరాకు నీడ భూదేవికి టాటూ వేసినట్టు వుంటుంది... కొబ్బరాకు పైన పడ్డ వెన్నెల ఆ ఆకు చివర్న కిందికి జారుతుంటే ... కొబ్బరాకు సందుల్లోంచి చందమామని చూస్తుంటే... సనసన్నగా ఆ ఆకుల సవ్వడి వినిపిస్తుంటే... వెన్నెల నీడ మన పైన ఊగుతుంటే... ఎంత బాగుంటుందో... అందుకే కొబ్బరాకు చిన్నప్పట్నించి ఇష్టం. కొబ్బరి చెట్ల మధ్య పెరిగాను కాబట్టి కూడానేమో... రోజు కాస్సేపు కొబ్బరాకు నీడన కబుర్లు చెప్పుకుందాం ... అచ్చ తెలుగు కొబ్బరాకు కిందికి స్వాగతం. ...గోపరాజు రాధాకృష్ణ