వేటూరి వారికి అక్షర నివాళి

వేటూరి...మూడు అక్షరాల సాహితీ సర్వస్వం.
తెలుగు సినిమా పాత చెంపలకి చందనం పూసి,
కాళ్ళకు పసుపు పారాణి రాసి...
పాటని నవ్వించి, కవ్వించి పెంచి పెద్ద చేసి...
పాటని ఇందువదనా కుందరదన
మందగమన మధుర వచనగా
మన ముందు నిలబెట్టిన వేటూరి వారు
అనంత లోకాలకి వెళ్ళిపోయారు...

సందర్భం వింటుండగానే
సాహితీ గంగని ఆలోచన లోకల్లోంచి
ఇలకు దింపే ప్రయత్నం అనునిత్యం చేసే
అపర భగిరధుడు ఆయన...
పాటంటే మూడు నిమిషాల సాహిత్యంతో
కలబోసుకున్న సంగీతం మాత్రమే కాదని...
అది జీవితానికి మార్గదర్శి లా దిక్సూచిలా
పనిచేస్తుందని ఆజన్మాంత పాఠం చెప్పిన
మహానుభావుడు ఆయన...
ఆయన పాటని, మనల్ని వదలి వెళ్ళారంటే
మనతో పటు పాటకీ కళ్ళు చేమరుస్తున్నాయి.
ఆయన పాటల్లో ఒదిగిన భావాలూ బావురుమంతున్నాయి
ఆయన ఆలోచనల్ని శాశ్వతంగా నిలబెట్టిన
అక్షరాలూ అనాదలయ్యాయి.
aయినా ఆయన పాత అమరం.
...రాధాకృష్ణ

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్