పోస్ట్‌లు

2011లోని పోస్ట్‌లను చూపుతోంది

నేను.

చిత్రం
గోదావరి, సముద్రం కలిసేచోట...నేను...

మొక్క

చిత్రం
నర్సరీ నుంచి  న్యూక్లియర్ ఫ్యామిలికి  కుండీ మొక్క 

నా కథ

నిన్న సాక్షి ఫన్ డే లో నా కథ  విజయశ్రీ టూరింగ్ టాకీస్, మోరి వచ్చింది. వీలైతే చదవమని విన్నపం.  - రాధాకృష్ణ

ఆల్బం

చిత్రం
చిక్కడపల్లి "సాహిత్య భారతి"  (పుస్తకాల కొట్టు)లో  శ్రీ బాపు గారి బొమ్మలు, ముఖచిత్రాలతో  ఏర్పాటు చేసిన ప్రదర్శనలో  నా "ఆల్బం" పుస్తకం కూడా పెట్టారు. 

శుభాకాంక్షలు

చిత్రం
నింగికి బాణసంచా రంగులద్ది  చీకటికి వెలుగుల తిలకం దిద్ది బంగారు కాంతుల దీపకళికకు  నాట్యం నేర్పిన దీపావళి శుభాకాంక్షలు.

అంతర్ముఖి

చిత్రం
తనవైపు తను  తిరుగుతూ... కెరటం అంతర్ముఖి

వాలెంటైన్స్ డే

చిత్రం
  పొదల మాటున  పక్షుల వాలెంటైన్స్ డే 

స్వాగతం

చిత్రం
కొత్తవారికి  కొబ్బరాకు నీడలోకి  స్వాగతం.

పుట్టినరోజు

చిత్రం
  రేపు  పాప  పుట్టినరోజు

నాలుగు చేతులు

చిత్రం
ఆ అమ్మకి  నాలుగు చేతులు పుట్టు కొ స్తాయిప్పుడు

సంధ్యా విహంగం

చిత్రం
పశ్చిమానికి  చేరుకుంది  సంధ్యా విహంగం

పరుగు పందెం

చిత్రం
చెట్ల వెనక  పరుగెత్తు కొ స్తున్నాడు  సూరీడు 

గుండె కరిగింది

చిత్రం
మేఘం గుండె కరిగింది నెర్రెల నేలని చూసి
చిత్రం
కొబ్బరాకు నీడకి ఏడాది...

ఆమె నవ్వు

చిత్రం
చెట్టు కొమ్మకి పూసింది ఆమె నవ్వు

ఫౌంటైన్

చిత్రం
ఎవరిమీదో ఎగిరిపడిపోతోంది ఫౌంటైన్

కవిత...

చిత్రం
ఆలోచన అల లా ఆకాశాన్ని తాకితే అది కవిత... తెల్ల కాగితం పైన సృజన నాట్యం చేస్తే అది కవిత... ఆవేదన సాగర మథనం లోంచి పుట్టిన  అమృత కలశం కవిత... గుండె లోయలో విరిసే పున్నమి వెన్నెల్లో మంచు తెరలా కవితాసుందరి జడకుచ్చులు విసిరితే అది కవిత... ఊహా  సుందరి పల్లకిలో ఎక్కి మనసులోకి తరలి వచ్చి కుదురు లేకుండా చేస్తే అది కవిత... ఆలోచన అక్షరంలా కరిగి కాగితాన్ని సుసంపన్నం చేస్తే అది కవిత.. అంతర్జాతీయ కవిత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. - రాధాకృష్ణ

సుమ గీతం

చిత్రం
సుమ గీతానికి గొంతు సవరించింది మొగ్గ
చిత్రం
పున్నమి పువ్వై వెన్నెల పూసింది  నెలవంక మొగ్గ