కవిత...
ఆలోచన అల లా ఆకాశాన్ని తాకితే అది కవిత...
తెల్ల కాగితం పైన సృజన నాట్యం చేస్తే అది కవిత...
ఆవేదన సాగర మథనం లోంచి పుట్టిన అమృత కలశం కవిత...
గుండె లోయలో విరిసే పున్నమి వెన్నెల్లో మంచు తెరలా కవితాసుందరి జడకుచ్చులు విసిరితే అది కవిత...
ఊహా సుందరి పల్లకిలో ఎక్కి మనసులోకి తరలి వచ్చి కుదురు లేకుండా చేస్తే అది కవిత...
ఆలోచన అక్షరంలా కరిగి కాగితాన్ని సుసంపన్నం చేస్తే అది కవిత..
అంతర్జాతీయ కవిత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
- రాధాకృష్ణ
బాగున్నాయి రాధాకృష్ణగారు మీ కవితా మూలాలు
రిప్లయితొలగించండిఅంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.
Thanq so much...
రిప్లయితొలగించండిradhakrishna
emaye naa kavitha....kavitha!
రిప్లయితొలగించండిKalalo dachukunna kavitha...
patanu gurthuku thechharu gora garu...
To be frank...
TO BE WITH YOU IS LIFE!