నా పుస్తకం...

పుస్తకం.నెట్ లో నా పుస్తకం గురించి రాసినందుకు అరుణ గారికి ధన్యవాదాలతో కూడిన కృతజ్ఞతలు. 
ప్రతి కవితలోనూ మనం చూడని యాంగిల్ ని తీసుకురావడం నా ఉద్దేశం.
‘నిద్రకి
పీఠిక
ఆవులింత’

‘రెండో బాల్యానికి
బారసాల
షష్టిపూర్తి’

‘నీళ్లు
నడిచే దారి
నది’

‘నురుగుతో
పళ్లకి ఒళ్లు రుద్దుతోంది
టూత్ బ్రష్’

ఇవి నిర్వచనాలా?
నా అజ్ఞానానికి అందడం లేదు.

అరుణ మరో విషయం ప్రస్తావించారు...
హైకు సదృశ కవితలు అని ఎందుకు పెట్టారో అని.
పైగా గోడ మీద పిల్లి టైపు అని కూడా ఒక చురక అంటించారు.

పదిహేడు అక్షరాల్లో రాసి, కేవలం అదొకటే లక్షణంగా తీసుకొని దానికి హైకు అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు.
హైకుకి దగ్గరగా ఉండేలా మాత్రమే నేను రాయగలిగాను. ఆ విషయాన్నీ హిపోక్రసీ లేకుండా కవర్ పైన ఒప్పుకున్నాను.

ఆ విషయాన్నే ఆల్బం కి పెట్టాను.
అది నిజాయతీయే గాని సౌలభ్యం కాదు.
హైకు గురించి చదివి, శ్రీ గాలి నాసర రెడ్డి గారితో మాట్లాడి, ఈ విషయాన్నీ నిర్ధారించాను.

గోపరాజు రాధాకృష్ణ

కామెంట్‌లు

  1. అరుణ గారు కొంచం పక్షపాతంగానే రాసినప్పటికీ, గాలి నాసరరెడ్డిగారు మీ పుస్తకం చదివినట్లు లేరు. ఉండుంటే, వాటికి కొత్తగా నామకరణం చేసుండేవారు.

    రిప్లయితొలగించండి
  2. I sent this book to Nasara reddy garu before publication and he suggested the same. That's why I put the title.

    Thanx for your response.

    radhakrishna

    రిప్లయితొలగించండి
  3. మిమ్మల్నిలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందండీ .మీరు రాసిన చాలా కధలు చదివాను మీరు మా టి.వి లో రాధ మధు సీరియల్ కి పనిచేసారా

    రిప్లయితొలగించండి
  4. నా కథలు ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు.
    వున్నై నాన్ కాదలిక్కరెన్ కథ చదివారా? వార్త ఆదివారం పుస్తకం లో ఆ కథ వచ్చింది.
    "చినుకులా రాలి" కథ విపుల కి సెలెక్ట్ అయింది.
    "గుండె గోదారి" కథ రాసాను.

    రాధా మధు సీరియల్ కి నేను పనిచేయలేదు.

    రాధాకృష్ణ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్