పుస్తకం.నెట్ లో నా పుస్తకం గురించి రాసినందుకు అరుణ గారికి ధన్యవాదాలతో కూడిన కృతజ్ఞతలు.   ప్రతి కవితలోనూ మనం చూడని యాంగిల్ ని తీసుకురావడం నా ఉద్దేశం.  ‘నిద్రకి  పీఠిక  ఆవులింత’  ‘రెండో బాల్యానికి  బారసాల  షష్టిపూర్తి’  ‘నీళ్లు  నడిచే దారి  నది’  ‘నురుగుతో  పళ్లకి ఒళ్లు రుద్దుతోంది  టూత్ బ్రష్’  ఇవి నిర్వచనాలా?  నా అజ్ఞానానికి అందడం లేదు.   అరుణ మరో విషయం ప్రస్తావించారు...  హైకు సదృశ కవితలు అని ఎందుకు పెట్టారో అని.  పైగా గోడ మీద పిల్లి టైపు అని కూడా ఒక చురక అంటించారు.   పదిహేడు అక్షరాల్లో రాసి, కేవలం అదొకటే లక్షణంగా తీసుకొని దానికి హైకు అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు.  హైకుకి దగ్గరగా ఉండేలా మాత్రమే నేను రాయగలిగాను. ఆ విషయాన్నీ హిపోక్రసీ లేకుండా కవర్ పైన ఒప్పుకున్నాను.   ఆ విషయాన్నే ఆల్బం కి పెట్టాను.  అది నిజాయతీయే గాని సౌలభ్యం కాదు.  హైకు గురించి చదివి, శ్రీ గాలి నాసర రెడ్డి గారితో మాట్లాడి, ఈ విషయాన్నీ నిర్ధారించాను.   గోపరాజు రాధాకృష్ణ