- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
పోస్ట్‌లు
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మె'మోరి'న్ - 2 బ్రహ్మాజీరావు గారు అలా గుండెలు బాదుకుంటూ రావడానికి ఒక మూడు నిమిషాల ముందు.. భోగిమంట దగ్గర ముప్పర్తి సూర్రావుకి, బోణం బుచ్చిబాబుకీ మధ్య మాటలు... "ఈ సెగేంట్రా బాబా...అబ్బో.. బెమ్మాండం.. ఇలాంటి చెక్క ఇప్పుడు దొరకట్లేదు.. ఏంటి ?మంచి చెక్కరా.. ఎవరు ఇచ్చారో గానీ! " అన్నాడు సూర్రావు - మంట కి కొంచెం దూరంగా జరిగి వెనక వైపు శరీరానికి కాక పెట్టడానికి తిరుగుతూ. "మనోళ్లు మామూళోళ్లేంటి బాబాయ్.. ఇరగదీస్సారంతే... " అన్నాడు బుచ్చిబాబు మంట వేడి కళ్ళకి తగలకుండా చేతులు అడ్డం పెట్టుకుని. "ఎవరో గానీ ఆ మహానుభావుడు.. ఆళ్ళ ఇంటికెళ్లి దండేసి దణ్ణమెట్టాల్రా బాబా... " అన్నాడు సూర్రావు. మంటకి కొంచెం దూరంగా రామాలయం మంటపం పిట్టగోడ మీద కూర్చున్నపిండి నానాజీ అందుకున్నాడు. "ఇంటికెల్డం ఎందుకు... దండ రెడీ ఎట్టుకో.. ఆయనే వచ్చేత్తన్నాడు..." అని సూర్రావుకి చెప్పి చల్లగా జారుకున్నాడు. సూర్రావు అటు చూశాడు. సన్నగా ఉండే బ్రహ్మాజీ రావు గారు మహా స్పీడు మీదున్నారు. ఒక్క వేటుకి వందమందిని నరికే లెవెల్లో వుంది ఆయన నడకలో అడుగుల్లో కోపం. తలకంటే పెద్ద సైజులో మాఫ్లర్ చుట్టి
మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మోరి... జాగ్రఫీ- కోనసీమ. ఫోటోగ్రఫీ- చుట్టూ పచ్చదనం.. అటుపక్క గోదావరి అందం ... ఇటుపక్క సముద్రం... !! భోగి పండగ రోజు ... టైం రఫ్ గా నాలుగు.. చలిని తట్టుకోవడం చాలా టఫ్ గా ఉంది. మంచు తెర కప్పినట్టుంది ఊరంతా. మకర్రాశిలోకి మారిన సూరీడు కొత్తిల్లు సద్దుకోడంలో హడావిడిలో ఉన్నాడేమో ... ఇంకా పైకి రాలేదు. వీధులన్నీ కొత్త పెళ్ళికూతుళ్లలా అందంగా ఒద్దిగ్గా ముస్తాబై ఉన్నాయి. అప్పటివరకూ వాకిళ్ళని పేడతో అలికి, ముగ్గులతో సింగారించిన ఆడవాళ్లు కాస్సేపు నడుమువాల్చి చిన్న కోడి కునుకుతీసి వెంటనే మళ్ళీ లేచి పండగ సందడి మొదలు పెట్టారు. గంగాళాలతో నీళ్లు గాడిపొయ్యలెక్కాయి. భోగి మంటలకంటే ముందే ఇళ్లల్లో ఈ మంటలు అందుకున్నాయి. చిన్న పిల్లలు చిన్నా చితుకూ ఖాళీల్ని ముగ్గులతో నింపేస్తున్నారు. నడవడానికి కాళ్ళు కాదుకదా వేళ్ళు కూడా పెట్టడానికి చోటులేకుండా. నైట్ హాల్ట్ బస్సు డ్రైవరు, కండక్టరు రగ్గులు చుట్టేసుకుని, వణికిపోతూ బస్సు అద్దాల్లోంచి చూస్తూ కూర్చున్నారు.. భోగి మంట ఎప్పుడు వెలిగిస్తారా అని. "చలపతిరాయ నికేతనం" లోంచి వెలివేల వెంకటాచలం గారు, గోపరాజు సుందరరావు గారు, గోపరాజు సూర్యనా