మోరి... జాగ్రఫీ- కోనసీమ. ఫోటోగ్రఫీ- చుట్టూ పచ్చదనం.. అటుపక్క గోదావరి అందం ... ఇటుపక్క సముద్రం... !! భోగి పండగ రోజు ... టైం రఫ్ గా నాలుగు.. చలిని తట్టుకోవడం చాలా టఫ్ గా ఉంది. మంచు తెర కప్పినట్టుంది ఊరంతా. మకర్రాశిలోకి మారిన సూరీడు కొత్తిల్లు సద్దుకోడంలో హడావిడిలో ఉన్నాడేమో ... ఇంకా పైకి రాలేదు. వీధులన్నీ కొత్త పెళ్ళికూతుళ్లలా అందంగా ఒద్దిగ్గా ముస్తాబై ఉన్నాయి. అప్పటివరకూ వాకిళ్ళని పేడతో అలికి, ముగ్గులతో సింగారించిన ఆడవాళ్లు కాస్సేపు నడుమువాల్చి చిన్న కోడి కునుకుతీసి వెంటనే మళ్ళీ లేచి పండగ సందడి మొదలు పెట్టారు. గంగాళాలతో నీళ్లు గాడిపొయ్యలెక్కాయి. భోగి మంటలకంటే ముందే ఇళ్లల్లో ఈ మంటలు అందుకున్నాయి. చిన్న పిల్లలు చిన్నా చితుకూ ఖాళీల్ని ముగ్గులతో నింపేస్తున్నారు. నడవడానికి కాళ్ళు కాదుకదా వేళ్ళు కూడా పెట్టడానికి చోటులేకుండా. నైట్ హాల్ట్ బస్సు డ్రైవరు, కండక్టరు రగ్గులు చుట్టేసుకుని, వణికిపోతూ బస్సు అద్దాల్లోంచి చూస్తూ కూర్చున్నారు.. భోగి మంట ఎప్పుడు వెలిగిస్తారా అని. "చలపతిరాయ నికేతనం" లోంచి వెలివేల వెంకటాచలం గారు, గోపరాజు సుందరరావు గారు, గ...
do u need an adsense account for just rs.750 then contact 09470019416
రిప్లయితొలగించండినమస్తే గోపరాజు రాధాకృష్ణ గారూ!నా మీ పేరు చాల చిర పరిచయం. ఇప్పుడే ఈ మీ బ్లాగ్ చూస్తున్నాను. చూపులకు విభిన్నంగా వుంది.మీ అభిరుచిని తెలియచేస్తుంది. మీతో పరిచయం పెరగాలని కోరుకుంటున్నాను. మీ బ్లాగ్ చూసిన తరువాత స్పందిస్తాను.నా http://karlapalem-hanumantharao.blogspot.com మీద కూడా ఒక లుక్కేసి మీ అభిప్రాయం చెపితే సంతోషం.
రిప్లయితొలగించండిGuruji..namaskaram. Mee vyasaalni chala kalamga chustunnanu. Manchi hasyam rastunnaru. Ika mana "nettarikam" konasagutundi.
రిప్లయితొలగించండిregards
radhakrishna