పోస్ట్‌లు

జులై, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

చినుకులా రాలి

చిత్రం
 విశ్వ కథా వేదిక "విపుల" ఆగస్ట్ సంచికలో  నా "చినుకులా రాలి" కథ వచ్చింది. అది రొమాంటిక్ కథల సంకలనం. కేవలం ఎస్.ఎం.ఎస్. లతో రాసిన కథ "చినుకులా రాలి" . ఇది ఒక కొత్త తరహా కథ.(అని నేను తెగ ఫీల్ అయిపోతున్నాను) చినుకుల కాలంలో చినుకుల కథ... చదవమని కోరుతూ..చదువుతారని ఆశిస్తూ.. - గోపరాజు రాధాకృష్ణ  

దిండు

చిత్రం
  దిండు  వొళ్ళు చేసింది  ప్రయాణంలో

వుడికిపోతోంది

చిత్రం
కడుపు  వుడికిపోతోంది  కుక్కర్ కి 

సుహాసిని

చిత్రం
  బొమ్మరిల్లు సెట్ లో సుహాసిని మణిరత్నం  గారితో ...

మామ...చందమామ

చిత్రం
  చెట్టు నీడ  ఆకుల్లోంచి చూస్తోంది చందమామని

అమ్మతనం

చిత్రం
 ఆపద్ధర్మ  అమ్మతనం  క్రెష్

తీరిక

చిత్రం
  లిఫ్టు వచ్చాకా మెట్లకు కాస్త  తీరిక (ఆల్బం నుంచి)

రిలీఫ్

చిత్రం
 కప్పు లో  కాఫీ ఉక్కిరిబిక్కిరి  సాసర్లో రిలీఫ్ (ఆల్బం నుంచి...)

పులిసిపోయింది

చిత్రం
  తన్నులు తిని వొళ్ళు పులిసిపోయింది ఫుట్ బాల్ కి (ఆల్బం నుంచి...)

అక్షరం

చిత్రం
   ఆలోచనల   పాదముద్ర   అక్షరం  (ఆల్బం నుంచి...)

నువ్వు

చిత్రం
 నేనంటే  ఇంకో నువ్వు (ఆల్బం నుంచి..)

కొత్తిల్లు

చిత్రం
 పండగ వెళ్ళాకా  కొత్తిల్లు కట్టుకుంది  సాలీడు (ఆల్బం నుంచి...)

జ్ఞాపకాలు

చిత్రం
జ్ఞాపకాలు  నడిచొస్తాయి  నీ పాదముద్రల మీంచి (ఆల్బం నుంచి..) ...రాధాకృష్ణ

తుమ్మెద

చిత్రం
 తుమ్మెద  రెక్కల్నిండా  టాటూలే (ఆల్బం నుంచి...) - గోపరాజు రాధాకృష్ణ

నా పుస్తకం...

పుస్తకం.నెట్ లో నా పుస్తకం గురించి రాసినందుకు అరుణ గారికి ధన్యవాదాలతో కూడిన కృతజ్ఞతలు.  ప్రతి కవితలోనూ మనం చూడని యాంగిల్ ని తీసుకురావడం నా ఉద్దేశం. ‘నిద్రకి పీఠిక ఆవులింత’ ‘రెండో బాల్యానికి బారసాల షష్టిపూర్తి’ ‘నీళ్లు నడిచే దారి నది’ ‘నురుగుతో పళ్లకి ఒళ్లు రుద్దుతోంది టూత్ బ్రష్’ ఇవి నిర్వచనాలా? నా అజ్ఞానానికి అందడం లేదు. అరుణ మరో విషయం ప్రస్తావించారు... హైకు సదృశ కవితలు అని ఎందుకు పెట్టారో అని. పైగా గోడ మీద పిల్లి టైపు అని కూడా ఒక చురక అంటించారు. పదిహేడు అక్షరాల్లో రాసి, కేవలం అదొకటే లక్షణంగా తీసుకొని దానికి హైకు అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు. హైకుకి దగ్గరగా ఉండేలా మాత్రమే నేను రాయగలిగాను. ఆ విషయాన్నీ హిపోక్రసీ లేకుండా కవర్ పైన ఒప్పుకున్నాను. ఆ విషయాన్నే ఆల్బం కి పెట్టాను. అది నిజాయతీయే గాని సౌలభ్యం కాదు. హైకు గురించి చదివి, శ్రీ గాలి నాసర రెడ్డి గారితో మాట్లాడి, ఈ విషయాన్నీ నిర్ధారించాను. గోపరాజు రాధాకృష్ణ

బోకే

చిత్రం
పూలు వాడిపోయాయి శుభాకాంక్షలు  సజీవం